Share News

BRS: ఊహల నగరం కోసం హైదరాబాద్‌ను విస్మరిస్తారా?

ABN , Publish Date - Oct 03 , 2024 | 02:36 PM

Telangana: రెండవ దశ మెట్రో పనులకు రూ.24 వేల కోట్లు బడ్జెట్ పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.11 కోట్లు బడ్జెట్‌లో పెట్టిందన్నారు. ఫోర్త్ సిటీ ఒక కల్పిత నగరం అని.. ఫోర్త్ సిటీ అంటే పేపర్ పైన లేని నగరం అంటూ వివేకానంద వ్యాఖ్యలు చేశారు.

BRS: ఊహల నగరం కోసం హైదరాబాద్‌ను విస్మరిస్తారా?
BRS MLA Vivekananda Goud

హైదరాబాద్, అక్టోబర్ 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ (BRS MLA Vivekananda Goud) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. 69 కిలోమీటర్ల మేర మెట్రోను పూర్తి చేసి ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. మెట్రో రైలును రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు తీసుకువెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.

Cm Revanth Reddy: సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్‌ కార్డులు అవసరం


రెండవ దశ మెట్రో పనులకు రూ.24 వేల కోట్లు బడ్జెట్ పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.11 కోట్లు బడ్జెట్‌లో పెట్టిందన్నారు. ఫోర్త్ సిటీ ఒక కల్పిత నగరం అని.. ఫోర్త్ సిటీ అంటే పేపర్ పైన లేని నగరం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ సిటీకి మెట్రో తీసుకువెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. ఊహల నగరం కోసం హైదరాబాద్ నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే ఫోర్త్ సిటీ అని సీఎం అంటున్నారన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మెట్రో అవసరం ఉందని గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలను రేవంత్ మోసం చేశారన్నారు.

Janimaster: జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే


రియల్ ఎస్టేట్ కోసమే మూసీ బ్యూటిఫికేషన్ అని సీఎం అంటున్నారని.. రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ప్రజల భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో హైదరాబాద్ నగరంలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. హైదరాబాద్ హెల్త్ సిటీ గురించి ప్రభుత్వానికి ఊసే లేదన్నారు. హైదరాబాద్ నగరంపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని..‌ సిటీ నుంచి ఒక్క మంత్రి లేరన్నారు. ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాలన పడకేసిందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

Bathukamma: రెండో రోజు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే

Janimaster: జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2024 | 02:50 PM