Share News

Eatala Rajendar: పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదు.. ఈటల రాజేందర్ మాస్ వార్నింగ్

ABN , Publish Date - Sep 27 , 2024 | 02:57 PM

ప్రజల మీద రేవంత్ ప్రభుత్వం దౌర్జన్యం చేయడం సరికాదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా విషయంలో హై కోర్టుకు వెళ్తామని.. తాము చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.

Eatala Rajendar: పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదు.. ఈటల రాజేందర్ మాస్ వార్నింగ్

హైదరాబాద్: హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్ డ్రామాలు ఆడుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాను నియమించిన రోజే ఇది డ్రామా అని చెప్పానని అన్నారు. హైడ్రా అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం చెరువులు, కుంటలు చుట్టూ ఉంది.. ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పేదల ఇళ్లను కూల్చవద్దని ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.


ALSO READ: Big Breaking: సర్వే చేస్తున్న అధికారులపై మూసీ నివాసితుల దాడి

చైతన్యపురి డివిజన్ న్యూ మారుతి నగర్ మూసీ పరిసర ప్రాంతాల్లో ఈటల రాజేందర్ ఇవాళ(శుక్రవారం) పర్యటించి బాధితులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... పేదలపై కనికరం లేకుండా రేవంత్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. జొన్నల బండ వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని వాటిని కూడా కూల్చేందుకు రేవంత్ ప్రభుత్వం పనులు చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.


మూసీని సుందరీకరణ చేస్తే తమకు ఇబ్బంది లేదు... కానీ ఎన్నడో భూమి కొన్న వారు ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నారని తెలిపారు. లక్షలు పెట్టి కొన్న ఇళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామనడ భావ్యంకాదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ ప్రాంతాల్లోకి ఏనాడూ మూసీ నుంచి వరద నీరు రాలేదని తెలిపారు. హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం బస్తీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ మాటలు నమ్మినందుకు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.

EETALA-2.jpg


ALSO READ: Hyderabad: టెన్షన్.. టెన్షన్..! ఆపరేషన్‌ మూసీతో గ్రేటర్‌ వ్యాప్తంగా ఆందోళన

ఖబడ్దార్ రేవంత్.. ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై నివేదిక ఇస్తామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చట్టాలు, జడ్జీల మీద నమ్మకం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ రేవంత్ జాగిర్ కాదని... ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారన్న విషయం గుర్తుపెట్టుకుని మసలుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.


EETALA.jpg

ప్రజల మీద దౌర్జన్యం చేయడం సరికాదని అన్నారు. అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా విషయంలో హైకోర్టుకు వెళ్తామని.. తాము చూస్తూ కూర్చోమని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఆర్థిక మంత్రిగా చెబుతున్నాను... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పుల ఊబిలో రాష్ట్రం కురుకుపోయిందని అన్నారు.పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదని ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

KTR: హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు

Harishrao: సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను: మాజీ మంత్రి హరీష్ రావు

CM Revanth Reddy: కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే.. డిపార్టుమెంటే ఉండదు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2024 | 03:50 PM