TS Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక..
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:35 PM
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు.. తాజాగా విద్యార్థులకు పలు కీలక సలహాలు, సూచనలు చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు (Inter Exams) సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు.. తాజాగా విద్యార్థులకు పలు కీలక సలహాలు, సూచనలు చేసింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా తెలిపారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం నాడు.. ఇంటర్ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఎంతమంది రాస్తున్నారు..?
‘రాష్ట్రవ్యాప్తంగా 1521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. 9, 80, 978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,78, 718.. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 5,02, 260 మంది పరీక్షలు రాయనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై రివ్యూ చేయడం జరిగింది. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాదు.. ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం’ అని శృతి వెల్లడించారు.
ఆల్ ది బెస్ట్!
‘విద్యార్థులు మానసిక ఒత్తిడి తీసుకోకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి. వంద శాతం సిలబస్ పూర్తి చేశాం. ఒక్క నిమిషం నిబంధన అమలు కంటే అందరూ 9 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 475 మంది ఇంటర్ పరీక్షల గురించి టెలి మానస్‌కి కాల్స్ చేశారు. ఈసారి కూడా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్నాము’ అని శృతి ఓజా మీడియాకు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి