Devara-KTR: ప్రెస్‌మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన కేటీఆర్.. ఎందుకంటే?
ABN , Publish Date - Sep 25 , 2024 | 01:35 PM
రెండు రోజుల క్రితం నిర్వహించతలపెట్టిన ‘దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్’ అనూహ్యంగా రద్దయింది. ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు మించి హైదరాబాద్ నగరంలోని నోవాటెల్ హోటల్‌కు తరలి రావడంతో గందరగోళం ఏర్పడింది. భద్రతా కారణాల రీత్యా ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ (బుధవారం) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ సినిమా మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే రెండు రోజుల క్రితం నిర్వహించతలపెట్టిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దయింది. ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు మించి హైదరాబాద్ నగరంలోని నోవాటెల్ హోటల్‌కు తరలి రావడంతో చిన్నపాటి గందరగోళం ఏర్పడింది. దీంతో భద్రతా కారణాల రీత్యా ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ (బుధవారం) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్‌కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు గుప్పించారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పోలీసులు చేతులెత్తేశారని, తాము అధికారికంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్లు సంతోషంగా జరుపుకునే వాళ్లని కేటీఆర్ ప్రస్తావించారు. తాము సినిమా ఫంక్షన్లతో పాటు అన్ని మతాల పండుగలను సమర్థవంతంగా నిర్వహించామని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఫతేనగర్ ఎస్టీపీని సందర్శించిన అనంతరం కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈవెంట్ రద్దుపై నిర్వాహకులు ఏమన్నారంటే..
కాగా ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరమని ఈవెంట్ మేనేజర్లు ప్రకటించారు. ‘ఎన్టీఆర్‌పై అభిమానులకు ఉన్న అపారమైన అభిమానం, ప్రేమను మేము అర్థం చేసుకున్నామని, ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా తెరపై కనపడుతుండడంతో మీరంతా మరింత ఉత్సాహంగా ఉన్నారని నిర్వహకులు పేర్కొన్నారు. ‘‘తాజాగా జరిగిన పరిణామంతో మీరంతా ఎంత నిరుత్సాహానికి గురయ్యారని అర్థం చేసుకొని బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. పరిస్థితిని పూర్తిగా వివరించాలన్నదే మా ప్రయత్నం. మీకు జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాం. ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలోపెట్టుకొని మేము ఈ ఈవెంట్‌ను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని భావించాం. కానీ, వినాయక చవితి వేడుకలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దీన్ని హోటల్‌లో ఏర్పాటుచేయాల్సి వచ్చింది’’ అని నిర్వహకులు పేర్కొన్నారు.