Share News

BRS: బీఆర్‌ఎస్‌కు షాక్... సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్సీ

ABN , Publish Date - Jul 08 , 2024 | 10:43 AM

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులూతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌ ‌బై చెప్పేశారు. అలాగే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి పార్టీకి రాజీనామా చేసేశారు. దీంతో పార్టీ నుంచి వెళ్లిపోయేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది.

BRS: బీఆర్‌ఎస్‌కు  షాక్... సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్సీ
MLC Challa Venkatamireddy to resign from BRS

హైదరాబాద్, జూలై 8: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ పార్టీకి (BRS Party) దెబ్బ మీద దెబ్బ తగులూతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌ ‌బై చెప్పేశారు. అలాగే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి ‘కారు’ దిగేశారు. దీంతో పార్టీ నుంచి వెళ్లిపోయేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. అటు కాంగ్రెస్‌లో చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో ఎమ్మెల్సీ బీఆర్ఎస్‌ను వీడటానికి సిద్ధమయ్యారు.

Rahul Gandhi: వైఎస్సారే నాకు స్ఫూర్తి.. ఎంతో నేర్చుకున్నా..


సీఎం రేవంత్‌ను కలిసిన చల్లా...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి (MLC Challa Venkatrami Reddy) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ చల్లా భేటీ అయ్యారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగు నీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎంను ఎమ్మెల్సీ కోరారు. ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్‌లొ చల్లా చేరే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది గులాబీ పార్టీ.


ఇవి కూడా చదవండి..

Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

YS Jagan: ఎమ్మెల్యే పదవికి జగన్‌ రాజీనామా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 11:32 AM