MP Etela Rajender: ప్రోటోకాల్ పాటించని అధికారులపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా..
ABN , Publish Date - Jul 13 , 2024 | 07:46 PM
కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదంటూ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు.
హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదంటూ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగానే తనను పిలవకుండా అవమానిచారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరనున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. కనీసం శిలాఫలకంలో అయినా తన పేరు ఉందో లేదోనంటూ ఎంపీ ఈటల రాజేందర్ ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు..
Niranjan comments: వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతారు: TPCC ఉపాధ్యక్షుడు నిరంజన్
Weather Report: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న వరుణుడు.. ఇలాగే పరిస్థితి ఉంటే..!