Share News

Big Breaking: సుప్రీంలో కవితకు ఎదురుదెబ్బ

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:05 AM

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది.

Big Breaking: సుప్రీంలో కవితకు ఎదురుదెబ్బ

ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. కవిత తరపున కపిల్ సిబల్ (Kapil Sibal) వాదనలు వినిపించారు.

BJP: కమలం కసరత్తు.. నేడు అభ్యర్థులపై క్లారిటీ.. కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్న నామా?

కాగా.. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ (Delhi CM Aravind Kejriwal) అరెస్ట్ పై అత్యవసర విచారణకి సుప్రీంకోర్టు అంగీకరించింది.

టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Mar 22 , 2024 | 12:03 PM