Share News

Group-1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే హాల్ టికెట్లు..

ABN , Publish Date - Oct 09 , 2024 | 05:57 PM

గ్రూప్‌-1(Group-1) మెయిన్స్‌ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TGSPSC) శుభవార్త చెప్పింది. ఈనెల 14న అభ్యర్థులు టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోచ్చని తెలిపింది.

Group-1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే హాల్ టికెట్లు..

హైదరాబాద్: గ్రూప్‌-1(Group-1) మెయిన్స్‌ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGSPSC) శుభవార్త చెప్పింది. ఈనెల 14న అభ్యర్థులు టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోచ్చని తెలిపింది. మెయిన్స్ పరీక్షల కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు తెలుపుతూ టీజీఎస్‌పీఎస్సీ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. గ్రూప్-1 ఫైనల్ పరీక్షలు ఈనెల 21నుంచి 27వరకూ జరగనున్న నేపథ్యంలో ప్రకటన వెలువరించింది. ఏడు రోజులపాటు జరిగే పరీక్షలు రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ జరగనున్నాయి.


అయితే పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్‌కు మెుత్తం 31,382 మంది అర్హత సాధించగా వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జూన్‌ 9, 2024న జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షలకు మెుత్తం 3.02లక్షల మంది హాజరుకాగా.. ఫైనల్ పరీక్షలకు 31,382మంది ఎంపికయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో జరగనున్నాయి. అలాగే జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగిలినవన్నీ అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలోనే రాస్తారు. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి.

Also Read:

కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు

దుర్గమ్మ దర్శనానంతరం సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివే

హిందువుల మధ్య కాంగ్రెస్‌ చిచ్చుపెడుతోంది..

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 09 , 2024 | 06:01 PM