TS 10th Exam Hall Tickets: టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ABN , Publish Date - Mar 08 , 2024 | 03:47 PM
TS SSC Hall Ticket 2024: త్వరలో పదవ తరగతి పరీక్షలు(10th Exams) ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్స్‌ని(Hall Tickets) విడుదల చేసింది. మార్చి 7, 2024 నుంచి హాల్ టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన బోర్డు.. విద్యార్థులు తమ హాల్ టికెట్స్‌ని..
TS SSC Hall Ticket 2024: త్వరలో పదవ తరగతి పరీక్షలు(10th Exams) ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్స్‌ని(Hall Tickets) విడుదల చేసింది. మార్చి 7, 2024 నుంచి హాల్ టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన బోర్డు.. విద్యార్థులు తమ హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లాగిన్ అవడం ద్వారా టీఎస్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో జరుగుతాయి.
TS SSC హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆన్‌లైన్ మోడ్‌లో అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ SSC హాల్ టికెట్ 2024ని యాక్సెస్ చేయడానికి విద్యార్థులు కింది దశలను పాటించాలి.
1. అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ను సందర్శించాలి.
2. హోమ్‌పేజీలో తెలంగాణ 10th హాల్ టికెట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి
3. లాగిన్ కోసం అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.
4. TS SSC హాల్ టికెట్ 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5. హాల్ టికెట్‌ను చూడొచ్చు. లేదా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
6. భవిష్యత్ అవసరం కోసం హార్డ్ కాపీని మీవద్ద ఉంచుకోవాలి.
మీ హాల్ టికెట్‌లో ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..
విద్యార్థి రకం (రెగ్యులర్/ ప్రైవేట్/ OSSC/ వృత్తి)
రోల్ నంబర్
జిల్లా
విద్యార్థి పేరు
తల్లిదండ్రుల పేర్లు
పాఠశాల పేరు
కేంద్రం పేరు
ఐడింటిఫికేషన్ మార్క్స్
పుట్టిన తేది
లింగం
పరీక్ష మాధ్యమం
టైమ్ టేబుల్
విద్యార్థి ఫోటో, సంతకం
విద్యార్థులు తమ అడ్మిషన్ టిక్కెట్‌పై పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. తప్పులు ఏమైనా ఉంటే.. వాటిని సరిదిద్దడానికి సంబంధిత అధికారులను సంప్రదించాలి.
మరిన్ని ఎడ్యూకేషన్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..