Share News

Nithyanandarai: ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండాలి.. ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి సూచన

ABN , Publish Date - Sep 20 , 2024 | 10:31 AM

Telangana: శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ అభినందనలు తెలియజేశారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని... దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్‌లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీ పైన ఆధారపడి ఉంది’’ అని అన్నారు.

Nithyanandarai: ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండాలి.. ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి సూచన
Union Minister Nityanandarai

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిత్యానందరాయ్ (Union Minister Nithyanandarai) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌ల (IPS) గౌరవందనాన్ని కేంద్రమంత్రి స్వీకరించారు. అనంతరం కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ లకు అభినందనలు తెలియజేశారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని... దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్‌లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీ పైన ఆధారపడి ఉంది’’ అని అన్నారు.

ips.jpg

Phone Taping Case.. ఆ ఇద్దరికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు..


ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలన్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉండాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ను కట్టడి చేయడానికి కృషి చేయాలన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా కేసులను తొందరగా పరిష్కరించాలని తెలిపారు. నేరస్తులను పట్టుకొని వారికి తొందరగా శిక్షలు పడేలా చూడాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కోవిడ్ టైమ్ లో పోలీసుల సేవ గొప్పది అని కొనియాడారు. భారత పోలీస్ సేవను అత్యున్నత స్థానంలో నిలబెడతారనే నమ్మకముంది అని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు.

ips.jpg

Minister Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. వివరాలు ఇవే..


కాగా.. నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ ఘనంగా జరిగింది. పోలిస్ అకాడమీ నుంచి 188 మంది ట్రైనీ ఐపీఎస్ లు పాస్ అవుతున్నారు. వీరిలో 54 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లు, తెలంగాణకు నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించడం జరిగింది.


ఇవి కూడా చదవండి...

Minister Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. వివరాలు ఇవే..

KTR: ఇది ముమ్మాటికీ మోసం, నయవంచనే.. సర్కార్‌పై కేసీఆర్ విసుర్లు

ReadTelangana NewsAndTelugu News

Updated Date - Sep 20 , 2024 | 11:44 AM