సమ్మెను నీరుగార్చిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:00 AM
దేశవ్యాప్తను ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నీరు గార్చడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు.

గోదావరిఖని, ఫిబ్రవరి 16: దేశవ్యాప్తను ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నీరు గార్చడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలతో పాటు కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో సింగ రేణి కార్మికులు పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సమ్మె నోటీసు ఇవ్వడానికి చూపిన శ్రద్ధ కేంద్ర ప్రభుత్వ విధా నాలపై అవగాహన కల్పించడానికి ముందుకు రాలేదని, ఐఎన్‌టీయూసీ కేవలం నల్లబ్యాడ్జీలతో నిరసనతోనే సరిపెట్టుకున్నదని, ఏఐటీయూసీ సమ్మె చేయమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 50శాతానికిపైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారన్నారు. ఇప్పటికైనా కార్మికులను వంచించడం మానుకోవాలని, సమ్మె కు తూట్లు పొడిచే విధానాలు సరికాదని, కోల్ ఇండియాలో సమ్మె జరుగు తుంటే సింగరేణిలో మాత్రం యాజమాన్యానికి అనుకూలంగా కార్మిక సంఘా లు ఫోన్లు చేయించి కార్మికులను డ్యూటీలకు పిలిపించుకున్నారని విమర్శిం చారు. విలేకరుల సమావేశంలో ఆర్‌జీ-1 కార్యదర్శి మెండె శ్రీనివాస్, నాయకులు ఆసరి మహేష్, పీఆర్ చారి, గౌస్, నారాయణ, శంకర్, మల్లేష్, వెంకటేశ్వర్లు, రాజు, సురేష్, సత్యనారాయణ, సుభాష్ పాల్గొన్నారు.