Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్
ABN , Publish Date - Mar 18 , 2024 | 03:43 PM
Telangana: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా అని ప్రశ్నించారు.
జగిత్యాల, మార్చి 18: జగిత్యాల సభలో ప్రధాని మోదీ (PM Modi) అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా అని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ అప్పుడే ఎందుకు ఓపెన్ చెయ్యలేదని ప్రశ్నించారు. ఐదేళ్లుగా ఏం చేశావ్ అరవింద్ అని నిలదీశారు. షుగర్ ఫ్యాక్టరీ మూతకు కారణం బీజేపీనే అని ఆరోపించారు. ‘‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా. మోదీ వేషం రెండు సార్లు చూసినం’’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
WPL: రెండో సారి తుది మెట్టుపై బోల్తా.. కన్నీటిని ఆపుకోలేకపోయిన కెప్టెన్
Crime News: కీచక టీచర్.. విద్యార్థినిపై దొంగతనం నేరం మోపి.. బట్టలు విప్పించి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...