నరేందర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా
ABN , Publish Date - Nov 23 , 2024 | 04:24 AM
లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కొడంగల్ కోర్టు తన తీర్పు ను మరోసారి వాయిదా వేసింది.
వికారాబాద్, హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కొడంగల్ కోర్టు తన తీర్పు ను మరోసారి వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై ఈనెల 20న కొడంగల్ కోర్టులో విచారణ పూర్తయింది. హైకోర్టులో నరేందర్‌రెడ్డి తరఫున దాఖలు చేసిన పిటిషన్లపై ఇంకా తుది నిర్ణయం రాకపోవడంతో కొడంగల్ కోర్టు కూడా కస్టడీ పిటిషన్‌పై తీర్పును ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. కాగా, లగచర్ల ఘటనలో ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై పోలీసులను హైకోర్టు వివరణ కోరింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.