Share News

TG Politics: కేసీఆర్, రాహుల్ గాంధీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి విసుర్లు

ABN , Publish Date - Apr 10 , 2024 | 07:06 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.

TG Politics: కేసీఆర్, రాహుల్ గాంధీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి విసుర్లు
Konda Vishweshwar Reddy Slams KCR, Rahul Gandhi

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేక రాహుల్ గాంధీ కేరళ పారిపోయారని ధ్వజమెత్తారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వర రెడ్డి పర్యటించారు. శంకర్ పల్లి మండలంలో గల లక్ష్మారెడ్డి గూడా, గాజుల గూడ, దోబి పెట్ అలంకాన్ గూడ, ఫతేపూర్, బుల్కాపూర్, మూకిళ్ల, ప్రొద్దుటూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. దారి పొడవునా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


మోదీకి తిరుగులేదు

యావత్ దేశం ప్రధాని మోదీ వెంట నడుస్తోందదని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి తిరుగులేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ ఎరువులు అందిస్తున్నారని గుర్తుచేశారు. పంటకు మద్దతు ధర, కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ పాలనలో దేశ కీర్తి, ప్రతిష్టలు పెరిగాయని వివరించారు.


కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో బీజేపీ చేవెళ్ల కన్వీనర్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం, రాజేంద్రనగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, మైలార్ దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ శంకర్ పల్లి మండల అధ్యక్షుడు రాములు గౌడ్, కన్వీనర్ ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు నరసింహులు, సురేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, కన్నా వాసుదేవ్, కోమటి రెడ్డి దినేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవి, జంగారెడ్డి, వెంకటేష్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Telangana: మెదక్‌లో కాంగ్రెస్ సమావేశం.. బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు..

AP Politics: సర్వేపల్లిలో మితిమీరిన మంత్రి కాకాణి అల్లుడు ఆగడాలు: మాజీమంత్రి సోమిరెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 10 , 2024 | 07:07 PM