Share News

KTR: మూసీ ఆర్భాటం ఎవరి కోసం.. కేటీఆర్ సూటి ప్రశ్న

ABN , Publish Date - Oct 07 , 2024 | 02:37 PM

మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోందని.. ఆ సోకులు ఎవరికోసం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీరామారావు ప్రశ్నించారు.

KTR: మూసీ ఆర్భాటం ఎవరి కోసం.. కేటీఆర్ సూటి ప్రశ్న

హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోందని.. ఆ సోకులు ఎవరికోసం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీరామారావు ప్రశ్నించారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నట్టు సీఎం రేవంత్ వైఖరి ఉందన్నారు. నిత్యం బీద అరుపులు, రాష్ట్రం అప్పులపాలైంది అని చెబుతూ, డబ్బులు లేవంటూ లబోదిబోమనే కాంగ్రెస్ నేతలకు మూసీ సుందరీకరణకు డబ్బులెలా వస్తున్నాయని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్ ఆర్భాటం ఎవరి కోసమని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

  • రైతు రుణమాఫీకి డబ్బులు లేవు

  • రైతుబంధుకి డబ్బులు లేవు

  • రైతు కూలీలకు డబ్బులు లేవు

  • కౌలు రైతులకు డబ్బులు లేవు

  • నిరుద్యోగ భృతికి డబ్బులు లేవు

  • పేదవాళ్లకు పెన్షన్లకు డబ్బులు లేవు

  • మహిళలకు మహాలక్ష్మి పథకం అమలుకు డబ్బులు లేవు

  • ఆడపిల్లలకు స్కూటీలకు డబ్బులు లేవు

  • ఉద్యోగస్తులకు DAలకు డబ్బులు లేవు


  • మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్మికులకు జీతాలకు డబ్బులు లేవు

  • గ్రామాలలో పిచికారీ మందులకు డబ్బులు లేవు

  • బడిపిల్లలకు చాక్ పీసులకు డబ్బులు లేవు

  • దవాఖానలో మందులకు డబ్బులు లేవు

  • దళితబందుకు డబ్బులు లేవు

  • విద్యార్థుల స్కాలర్ షిప్లకు డబ్బులు లేవు

  • విద్యార్థుల ఫీజు రేయింబర్సుమెంట్కు డబ్బులు లేవు

  • తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు

  • చెరువుల్లో చేపపిల్లలు పెంచడానికి డబ్బులు లేవు

  • రెండో విడత గొర్రెల పంపిణీకి డబ్బులు లేవు

వేటికీ రూపాయి నిధులు విడుదల చేయని సర్కార్.. మూసీపై ఎందుకంత ప్రేమ చూపిస్తుందోనని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి...

Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ

Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 02:37 PM