Lok Sabha Elections 2024: కుబేరుడు విశ్వేశ్వర్‌రెడ్డి
ABN , Publish Date - Apr 26 , 2024 | 05:32 AM
నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది! అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్లు సమర్పించారు! రాజకీయ కుబేరులు ఎవరో.. కుచేలుడు ఎవరో లెక్క తేలింది! ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల
కుచేలుడు సుధీర్ కుమార్
అత్యధిక కేసులు ఆత్రం సుగుణపైనే
రఘువీర్ వద్ద మూడు తుపాకులు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది! అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్లు సమర్పించారు! రాజకీయ కుబేరులు ఎవరో.. కుచేలుడు ఎవరో లెక్క తేలింది! ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం.. కుబేరుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే.. కుచేలుడు వరంగల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్. అభ్యర్థులందరిలోనూ అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నది మాత్రం ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, గిరిజన హక్కుల కోసం పోరాడిన మహిళ ఆత్రం సుగుణపైనే! అభ్యర్థులంతా ఎంతో కొంత బంగారం ఉందని చూపించినా.. ఆమె వద్ద ఒక్క గ్రాము కూడా లేకపోవడం విశేషం. అలాగే, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి తన వద్ద 3 లైసెన్స్‌డ్ తుపాకులు ఉన్నట్లు చూపించారు. విచిత్రం ఏమిటంటే.. రాజకీయ కుబేరులు ముగ్గురూ చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులే!
కొందరి కుటుంబ ఆస్తుల వివరాలివే..
కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4,568.22 కోట్లు
రంజిత్ రెడ్డి రూ.300 కోట్లు
కాసాని జ్ఞానేశ్వర్ రూ.213.35 కోట్లు
మాధవీలత రూ.221.40 కోట్లు
నామ నాగేశ్వర్ రావు రూ.155.90 కోట్లు
తక్కువ ఆస్తులు వీరికే..
సుధీర్ కుమార్ రూ.20.31 లక్షలు
భరత్ ప్రసాద్ రూ.33.85 లక్షలు
కడియం కావ్య రూ.56.62 లక్షలు
బండి సంజయ్ రూ.65.70 లక్షలు
For More Telangana and Telugu News