Share News

Alcohol Demand: డిసెంబరు 31 వేడుకల నేపథ్యంలో మద్యం షాపుల్లో భారీగా నిల్వలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:33 AM

డిసెంబరు 31 అంటేనే.. మద్యం ప్రియులకు పండుగే పండుగ.. వారిని సంతృప్తి పరిచేందుకు మద్యం దుకాణాల నిర్వాహకులు డిపోల నుంచి భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

Alcohol Demand: డిసెంబరు 31 వేడుకల నేపథ్యంలో మద్యం షాపుల్లో భారీగా నిల్వలు

  • ఈనెలలో ఆబ్కారీకి రూ.3,500 కోట్లు

  • మరో 600 కోట్లు వస్తుందని అంచనా

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 31 అంటేనే.. మద్యం ప్రియులకు పండుగే పండుగ.. వారిని సంతృప్తి పరిచేందుకు మద్యం దుకాణాల నిర్వాహకులు డిపోల నుంచి భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. షాపులను పూర్తి నిల్వలతో నింపేస్తున్నారు. మంగళవారం రాత్రి కొత్త సంవత్సర వేడుకలు అంటే ఆదివారం నుంచే కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది.


ఈనెలలో ఇప్పటివరకు ఆబ్కారీ శాఖ రూ.3,500 కోట్లు ఆర్జించింది. ఆదివారం విక్రయాలు కూడా పూర్తయితే.. సోమ, మంగళవారాల్లో రూ.600 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2022 డిసెంబరు నెలలో రూ.3,100 కోట్లు ఆర్జించగా.. గతేడాది అదే నెలలో రూ.4,100 కోట్ల దాకా వచ్చాయి. ఈసారి ఆ రికార్డు బ్రేక్‌ అవుతుందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 04:33 AM