మహోన్నతుడు ఎన్టీఆర్
ABN , Publish Date - Mar 29 , 2024 | 11:02 PM
తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహోన్నత వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు కొనియాడారు.

- టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు
- ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
గద్వాల అర్బన్/ అయిజ, మార్చి 29 : తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహోన్నత వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు కొనియాడారు. పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమా లలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఓటర్లుగా మిగిలి పోకుండా, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలన్నారు. పార్టీలోనూ, పాలనలోనూ అన్ని వర్గాల వారికి పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు నిబద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రవియాదవ్, కార్యదర్శి నరసింహులు, మండల ఉపాధ్యక్షుడు వెంక టన్న, జమ్మన్న, పుల్లయ్యగౌడ్, రాజు, రంజిత్, కేశవ్, సురేష్, తిమ్మప్ప, రఘు, నవీన్ పాల్గొన్నారు.
- అయుజ పట్టణంలో టీడీపీ ఆవిర్బావ దినోత్సవాన్ని అయిజ పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. మండల అధ్యక్షుడు సుధాకర్‌గౌడు, ప్రధాన కార్యదర్శి తూముకుంట ఈరన్నగౌడు అధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఎన్‌టీఆర్ సర్కిల్‌లో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సీనియర్, జూనియర్ ఎన్‌టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.