Hyderabad: భారీస్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు..
ABN , Publish Date - Jun 16 , 2024 | 03:11 AM
రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పని చేస్తున్న 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి ఈ నియామకాలు చేపట్టింది.
కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు స్థానచలనం
20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. వెయిటింగ్‌లో 10 మంది
వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పని చేస్తున్న 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి ఈ నియామకాలు చేపట్టింది. కాగా, ఇప్పటి వరకూ ఆయా జిల్లాలకు కలెక్టర్లుగా పని చేస్తున్న పది మంది ఐఏఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. కాగా, కొత్త కలెక్టర్ల రాకతో రిలీవ్ కావాల్సిన 10 మంది పాత కలెక్టర్లకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. వీపీ గౌతమ్ (ఖమ్మం), పి.ఉదయ్‌కుమార్ (నాగర్‌కర్నూల్), పమేలా సత్పతి (కరీంనగర్), భవేష్ మిశ్రా (జయశంకర్-భూపాలపల్లి), యాస్మిన్ బాషా (జగిత్యాల), జి.రవి (మహబూబ్‌నగర్), హరిచందన దాసరి (నల్లగొండ), ఎస్.వెంకటరావు (సూర్యాపేట), ఇలా త్రిపాఠి (ములుగు), ఆల ప్రియాంక (భద్రాద్రి-కొత్తగూడెం)లకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది.