‘ప్రజావాణి’ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 20 , 2024 | 12:25 AM
‘ప్రజావా ణి’ ద్వారా స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుం డా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ హరిచందన
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 19: ‘ప్రజావా ణి’ ద్వారా స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుం డా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వాటిని ఆయా శాఖాల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర ఎంతో కీలకం
లోక్ సభ సాధారణ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ హరిచందన అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడా రు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 20మందిని నోడల్ అధికారులుగా నియమించామన్నారు. నోడల్ అధికారులు వారి బాధ్యతలను తెలుసుకొని ఎన్నికల నిబంధనల ప్రకా రం విధులు నిర్వర్తించాలన్నారు.
అర్హులైన వారందరూ పేర్లు నమోదు చేసుకోవాలి
ప్రధాన మంత్రి విశ్వకర్మపథకం కింద అర్హులైన వృత్తుల వారంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన దాసరి కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రో జు సెమినార్, అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కేవలం 5 శాతం వడ్డీకి రుణం పొందవచ్చని, సబ్సిడీ సైతం లభిస్తుందన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద జిల్లాలో 11 వేల మంది నమోదుచేసుకున్నారని, జిల్లా, మండలం, గ్రామీణ స్థాయిలో ఈ పథకం కింద యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములునాయక్, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఎంఎ్‌సఎంఈ కోఆర్డినేటర్ నవీన్, మెప్మా పీడీ కరుణాకర్, మహిళా, శిశు సంక్షేమ అధికారిని కృష్ణవేణి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలి
సమస్యలపై వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలని ఏఎస్పీ రాములునాయక్ అన్నారు. గ్రీవెన్స్‌డేలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో 30 మంది అర్జీదారులతో నేగా మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.