Rachakonda: సైకిల్‌పై గస్తీ.. ప్రజలతో దోస్తీ
ABN , Publish Date - Jul 30 , 2024 | 11:20 AM
కార్లలో తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు.. సైకిళ్లపై కూడా గస్తీకి శ్రీకారం చుట్టారు. రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) ఆదేశాలతో కమిషనరేట్ పరిధిలో 220 సైకిళ్లను కొనుగోలుచేసి అన్ని పోలీసుస్టేషన్లకు పంపించారు.
- రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సీపీ వినూత్నప్రయోగం
- పోలీస్ పెట్రోలింగ్‌లో మహిళా సిబ్బంది భాగస్వామ్యం
- విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం
- తక్షణ స్పందన.. సత్వర పరిష్కారం
హైదరాబాద్ సిటీ: కార్లలో తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు.. సైకిళ్లపై కూడా గస్తీకి శ్రీకారం చుట్టారు. రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) ఆదేశాలతో కమిషనరేట్ పరిధిలో 220 సైకిళ్లను కొనుగోలుచేసి అన్ని పోలీసుస్టేషన్లకు పంపించారు. ఇందులో భాగంగా విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా మహిళా పోలీసులు కూడా సైకిళ్లపై తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీల వద్ద నిఘా పెడుతూ ఆకతాయిల భరతం పడుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో పెట్రోలింగ్ చేయడంతోపాటు కాలనీలు, బస్తీల్లో విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని సీపీ సిబ్బందిని ఆదేశించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: క్వారీ గుంతలో మునిగి బాలుడి మృతి..
మహిళా సిబ్బంది సైతం..
ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాలకు మహిళలు అధిక సంఖ్యలో ఎంపికవుతున్నారు. ఈ నేపథ్యంలో కాలనీలు, బస్తీల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంకల్పించిన సీపీ ప్రజా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది సైకిళ్లపై విజిబుల్ పోలీసింగ్ చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు చేసిన ఈ వినూత్న ఆలోచనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
తక్షణ స్పందన.. సత్వర పరిష్కారం
రాచకొండ కమిషనరేట్ పరిధిలో డయల్-100, 112 నంబర్లకు వచ్చే ఫోన్‌కాల్స్‌పై తక్షణమే స్పందించి, సత్వర న్యాయం చేయాలని సీపీ ఇప్పటికే ఆదేశించారు. సమాచారం అందుకున్న వెంటనే వీలైనంత తక్కువ సమయంలో ఘటనా స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరానికి ప్రయత్నించాలన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ మహమ్మారి నిషేధంపై యువతకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చేలా పోలీసులు ప్రయత్నించాలన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై సమాచారం సేకరించి స్మగ్లర్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీపీ సూచించారు.
ఇదికూడా చదవండి: Bellampalli: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News