Share News

TG News: హుషారుగా లడ్డూ వేలం పాట పాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ ఆ తరువాత

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:20 AM

Telangana: హైదరాబాద్‌లోని మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మరణం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు రూ.15 లక్షల వరకు శ్యామ్ లడ్డు వేలం‌ పాట పాడారు.

TG News: హుషారుగా లడ్డూ వేలం పాట పాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ ఆ తరువాత
Vinayaka Laddu auction

రంగారెడ్డి, సెప్టెంబర్ 16: గత పదిరోజులుగా వినాయకుడికి (Lord Ganesh) భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. ఐదవ రోజు నుంచే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. వినాయకుని నిమజ్జనం రోజు చిన్నా, పెద్దా తేడా లేకుండా హుషారుగా డ్యాన్సులు చేస్తూ ఆ బొజ్జ గణపయ్యను సాగనంపుతుంటారు. అంతే కాకుండా వినాయకుడి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తూ వేలం పాటలో లడ్డూను కొనుగోలు చేస్తుంటారు. కొంత మంది ఆ లడ్డూ కోసం ఎంత డబ్బులు అయినా పెట్టేందుకు సిద్ధమవుతుంటారు. అదే విధంగా ఓ వ్యక్తి కూడా ఎంతో ఉత్సాహంగా గణపయ్య లడ్డూను అధిక ధరకు సొంతం చేసుకోవాలని భావించాడు. ఆ తరువాత నిమజ్జన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యాండ్‌కు హుషారుగా స్టెప్పులు వేశాడు. కానీ ఆ తరువాత జరిగిన అనుకోని ఘటన ఆ వ్యక్తి కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..


ఇంతకీ ఏం జరిగిందంటే..

రంగారెడ్డి జిల్లాలోని(Rangareddy) మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మరణం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు రూ.15 లక్షల వరకు శ్యామ్ లడ్డు వేలం‌ పాట పాడారు. ఆపై గణనాథుడి మండపం వద్ద నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే ఆ తరువాత శ్యామ్ ప్రసాద్ గుండె పోటుతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం



నిన్న (ఆదివారం) రాత్రి అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన‌ లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. గణనాథుడి మండపం వద్ద చాలా సేపు నృత్యాలు చేశారు. లడ్డు కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తీన్ మార్ స్టేప్పులు వేశాడు. కానీ ఇంటికి వెళ్లే సరికి శ్యామ్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా ఫలితం లేకుండా పోయింది. గుండె పోటు రావడంతో శ్యామ్‌ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్యామ్ మృతితో కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.


ఇవి కూడా చదవండి..

KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 16 , 2024 | 12:24 PM