Share News

Wanaparthy: సామాజిక బాధ్యతల నిర్వహణలో ఎస్‌బీఐ ఎల్లప్పుడూ ముందే

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:26 AM

దేశంలో సామాజిక బాధ్యతల నిర్వహణలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాస్‌ శెట్టి అన్నారు.

Wanaparthy: సామాజిక బాధ్యతల నిర్వహణలో ఎస్‌బీఐ ఎల్లప్పుడూ ముందే

  • ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాస్‌ శెట్టి

వనపర్తి, రాజీవ్‌ చౌరస్తా, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): దేశంలో సామాజిక బాధ్యతల నిర్వహణలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాస్‌ శెట్టి అన్నారు. ఆదివారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కల్యాణ్‌ సాయి గార్డెన్స్‌లో ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తి జిల్లాలో ఎస్‌బీఐకి 55 శాతం బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని, 45 శాతం మార్కెట్‌ షేర్‌ ఉందని చల్లా శ్రీనివాస్‌ శెట్టి తెలిపారు.


పీఎం విశ్వకర్మ రుణాలు ఇవ్వడంలో తెలంగాణ ఎస్‌బీఐ టీం దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. ఫౌండేషన్‌ తరపున దేశంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు, వెయ్యి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద తెలంగాణవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలకు చల్లా శ్రీనివా్‌సశెట్టి శ్రీకారం చుట్టారు. కాగా, చల్లా శ్రీనివా్‌సకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, రాజే్‌షరెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల కలెక్టర్లు ఘనంగా స్వాగతం పలికి, ఆయనను సన్మానించారు.

Updated Date - Oct 21 , 2024 | 04:26 AM