Share News

Secunderabad: ప్రయాణ కష్టాలు.. స్వగ్రామాలకు వెళ్లేందుకు పడరానిపాట్లు

ABN , Publish Date - May 12 , 2024 | 10:03 AM

ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు నగరంలో ఉంటున్న ఆంధ్రా ఓటర్లు రైలెక్కుతున్నారు. లక్షలాదిమంది ప్రయాణికులు రావడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) శనివారం కిక్కిరిసిపోయింది.

Secunderabad: ప్రయాణ కష్టాలు.. స్వగ్రామాలకు వెళ్లేందుకు పడరానిపాట్లు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌: ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు నగరంలో ఉంటున్న ఆంధ్రా ఓటర్లు రైలెక్కుతున్నారు. లక్షలాదిమంది ప్రయాణికులు రావడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) శనివారం కిక్కిరిసిపోయింది. రైళ్లలో రిజర్వేషన్లు దొరకనివారు కిక్కిరిసిన జనరల్‌ బోగీల్లో ప్రయాణం చేసేందుకు కుస్తీలు పట్టారు. భార్యాపిల్లలతో వెళ్తున్నప్పటికీ ఎంత కష్టమైనా సరే.. ఊరు చేరితే చాలన్నట్లుగా పోటీ పడ్డారు.

ఇదికూడా చదవండి: Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకుపోవచ్చా, మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..

అయితే, రిజర్వేషన్‌ బోగీలో సాధారణ ప్రయాణికులు ఎక్కకుండా ఉండేందుకు శనివారం ఆర్పీఎఫ్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ సీఐ సరస్వత్‌ తెలిపారు. మరోవెపు జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్ల(JBS and MGBS bus stations)తోపాటు ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్ల పాయింట్లు కూడా కిటకిటలాడాయి. ఓటు వేసేందుకు నగరం నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్లారు. శనివారం రాత్రి ఏపీ వైపు వెళ్లే బస్సులతో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ(Kukatpally, KPHB), అమీర్‌పేట, లక్డీకపూల్‌ తదితర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.

ఇదికూడా చదవండి: Hyderabad: ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 10:08 AM