Share News

Hyderabad: మా అమ్మను బతికించండి!

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:16 AM

ఆ రోజు పనికి వెళ్లకపోతే మరుసటి రోజు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లలేని స్థితిలో కూడా ఉన్నంతంలో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబానికి క్యాన్సర్‌ మహమ్మారి ఆ సంతోషం కూడా లేకుండా చేసింది. ఇంటిపెద్ద భార్య కు క్యాన్సర్‌ సోకడంతో వైద్యం కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు పెట్టారు.

Hyderabad: మా అమ్మను బతికించండి!

  • బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి చికిత్సకు తనయుడి ఆరాటం

  • రూ.30 లక్షల వరకు అవుతుందన్న బసవతారకం వైద్యులు

  • ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆ రోజు పనికి వెళ్లకపోతే మరుసటి రోజు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లలేని స్థితిలో కూడా ఉన్నంతంలో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబానికి క్యాన్సర్‌ మహమ్మారి ఆ సంతోషం కూడా లేకుండా చేసింది. ఇంటిపెద్ద భార్య కు క్యాన్సర్‌ సోకడంతో వైద్యం కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు పెట్టారు. మందులకే నెలకు రూ.40వేలు అవుతోంది. ఆమెకు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌(బీఎంటీ) చేయాలని, ఇందుకు రూ.30లక్షలు అవుతుందని బసవతారకం వైద్యులు చెప్పారు. బీఎం టీ చికిత్స ఆరోగ్యశ్రీ పరిఽధిలో లేకపోవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన అనుముల పద్మ (49)ఉపాఽధి కోసం తోపుడు బండిపై అరటిపండ్లు అమ్ముతోంది. ఆమె భర్త కూలీ. ముగ్గురు సంతానంలో అమ్మాయికి పెళ్లయింది.


కుమారుడు రాజు బీటెక్‌ పూర్తి చేయగా మరో కుమారుడు ఖాళీగా ఉన్నాడు. నిరుడు డిసెంబరు చివర్లో పద్మకు ఉన్నట్లుండి జ్వరమొచ్చింది. వైద్యుడికి చూపించినా మళ్లీ మళ్లీ వస్తుండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జనవరి 15న చేర్పించి మూడు రోజుల పాటు పరీక్షలు చేయించారు. బ్లడ్‌ క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. అక్కడే రూ.1.25 లక్షల బిల్లు అయింది. ఆ ఆస్పత్రిలో ఉంటే వైద్య ఖర్చులను భరించలేమని భావించి బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో పద్మను చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షించి.. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ (బీఎంటీ) చేయాలని, అందుకు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసి ఇచ్చారు. బీఎంటీ ఆరోగ్య శ్రీ పరిఽధిలోకి రాదని అక్కడి వైద్యులు తెలిపారు. బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం అప్పు చేసి రూ.9లక్షల దాకా ఖర్చు చేశారు. ఇక అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని ఆమె కుమారుడు రాజు ‘ఆంధ్రజ్యోతి’తో మొరపెట్టుకున్నాడు. చేతిలో డబ్బు లు లేకపోవడంతో మందులు వాడడటం లేదని, దీంతో అమ్మ ఆరోగ్యం క్షిణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. బీఎంటీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి లేకపోవడంతో సీఎం రేవంత్‌ రెడ్డి చికిత్సకు సహకరించి ఆదుకోవాలని కోరారు. దాతలు పెద్ద మనసుతో స్పందించి ఆదుకోవాలని, దాతలు 9666768636 సంప్రదించాలని విజ్ఞప్తి చేశాడు.

Updated Date - Jun 03 , 2024 | 05:16 AM