Share News

Hyderabad: రుణమాఫీ కటాఫ్‌ ఖరారు!

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:13 AM

రైతుల రుణమాఫీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తోంది. ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా.. తాజాగా కటాఫ్‌ తేదీపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Hyderabad: రుణమాఫీ కటాఫ్‌ ఖరారు!
Telangana Farmers

  • 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు

  • ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల మాఫీ.. ఒకే విడతలో

  • రూ.35 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా

  • భూమి పాస్‌బుక్‌, రేషన్‌, ఆధార్‌ ప్రామాణికంగా అర్హత

  • పీఎం కిసాన్‌ అందని వారికి వర్తింపజేయాలా? వద్దా?..

  • అన్నదానిపై పరిశీలన.. కేబినెట్‌లో చర్చించి విధివిధానాలు

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రైతుల రుణమాఫీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తోంది. ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా.. తాజాగా కటాఫ్‌ తేదీపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9వ తేదీ వరకు రుణాలు తీసుకున్న రైతులకు రూ.2 లక్షల చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కటాఫ్‌ తేదీ ప్రకారం రుణమాఫీకి దాదాపు రూ.35 వేల కోట్ల మేర నిధులు అవసరమవుతాయని కూడా అంచనాకు వచ్చినట్లు సమాచారం. కాగా, రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాలను గుర్తించేందుకు భూమి పాస్‌బుక్‌, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులను ప్రామాణికంగా విడతలుగా కాకుండా.. ఒకేసారి మాఫీ రుణమాఫీని విడతల వారీగా కాకుండా ఒకేసారి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కో విడతకు రూ.25 వేల చొప్పున నాలుగు విడతల్లో రూ.లక్ష మాఫీ చేసినప్పటికీ పలు ఇబ్బందులు తలెత్తాయి.


అసలు రుణంలో నుంచి కొంత మొత్తాన్ని మాఫీ చేయగా, మిగిలిన రుణానికి వడ్డీ పడింది. దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప.. రైతులకు పెద్దగా న్యాయం జరగలేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2లక్షల రుణాన్ని ఒకే దఫాలో మాఫీ చేయాలని యోచిస్తోంది. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంలో ఉంది. ఇక, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకంలో అనర్హులుగా ఉన్నవారికి రుణమాఫీ అందించాలా? లేదా? అన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పీఎం కిసాన్‌లో కేంద్ర ప్రభుత్వం అందించే సాయం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు ఆదాయపు పన్ను చెల్లించేవారికి అందడంలేదు. దీంతో రుణమాఫీ విషయంలోనూ అదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని పరిశీలిస్తోంది. వీటన్నింటిపైనా కేబినెట్‌లో చర్చించి విధివిధానాలు ఖరారు చేయనుంది.


విడతలుగా కాకుండా.. ఒకేసారి మాఫీ

రుణమాఫీని విడతల వారీగా కాకుండా ఒకేసారి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కో విడతకు రూ.25 వేల చొప్పున నాలుగు విడతల్లో రూ.లక్ష మాఫీ చేసినప్పటికీ పలు ఇబ్బందులు తలెత్తాయి. అసలు రుణంలో నుంచి కొంత మొత్తాన్ని మాఫీ చేయగా, మిగిలిన రుణానికి వడ్డీ పడింది. దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప.. రైతులకు పెద్దగా న్యాయం జరగలేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2లక్షల రుణాన్ని ఒకే దఫాలో మాఫీ చేయాలని యోచిస్తోంది.


అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంలో ఉంది. ఇక, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకంలో అనర్హులుగా ఉన్నవారికి రుణమాఫీ అందించాలా? లేదా? అన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పీఎం కిసాన్‌లో కేంద్ర ప్రభుత్వం అందించే సాయం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు ఆదాయపు పన్ను చెల్లించేవారికి అందడంలేదు. దీంతో రుణమాఫీ విషయంలోనూ అదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని పరిశీలిస్తోంది. వీటన్నింటిపైనా కేబినెట్‌లో చర్చించి విధివిధానాలు ఖరారు చేయనుంది.

Updated Date - Jun 17 , 2024 | 07:38 AM