Ponnam: ఐడీటీఆర్ ఏర్పాటుకు అనుమతివ్వండి
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:09 AM
దేశ రాజధాని న్యూఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లోనూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్(ఐడీటీఆర్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
మరిన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యేలా చూడండి
కేంద్ర మంత్రి గడ్కరీకి రాష్ట్ర మంత్రి పొన్నం వినతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, నవంబరు 27: దేశ రాజధాని న్యూఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లోనూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్(ఐడీటీఆర్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఐడీటీఆర్ కోసం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 40 ఎకరాల భూమిని కూడా గుర్తించామని తెలియజేశారు. ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, ఆర్ రఘురామి రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కార్‌తో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో మంత్రి పొన్నం బుధవారం కలిశారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే అండర్ రోడ్డు బ్రిడ్జి పనులపై చర్చించారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన పన్ను రాయితీలు సహా రాష్ట్ర రవాణా శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రం సహకరిేస్త రాష్ట్ర రవాణా శాఖ మరింత పురోగతి సాధిస్తుందని చెప్పారు. 15 ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి ఐడీటీఆర్ కేటాయించాలని కోరారు. అలాగే, మల్టీలేన్ వెహికిల్ ఫిట్‌నెట్ టెస్టింగ్ ేస్టషన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అడిగారు. ఎలకా్ట్రనిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆటోమెటిక్‌గా ఈ చలాన్లను జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర రహదారులను గుర్తించాలని అడిగారు. రాష్ట్రంలో మరిన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సహకరించాలని విన్నవించారు.