Tummla Nageshwar Rao: చిన్న చిన్న పొరపాట్లతో కొందరికి రుణమాఫీ కాలేదు
ABN , Publish Date - Aug 10 , 2024 | 03:24 AM
‘‘చిన్న, చిన్న పొరపాట్లతో కొందరికి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఈ నెల 15వ తేదీ తర్వాత వ్యవసాయాధికారులను కలిసి, సమస్యను వివరించాలి.
వారంతా 15 తర్వాత అధికారులను కలవాలి
ఈ సీజన్ నుంచే సన్న ధాన్యానికి 500 బోనస్: తుమ్మల
కోదాడ, ఆగస్టు 9: ‘‘చిన్న, చిన్న పొరపాట్లతో కొందరికి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఈ నెల 15వ తేదీ తర్వాత వ్యవసాయాధికారులను కలిసి, సమస్యను వివరించాలి. వారు తప్పులు సరిచేసి అర్హులకు రుణమాఫీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. రూ.2లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా కోదాడలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక సమస్యలతో పంట రుణాలు మాఫీ కాకపోతే లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతీ ఒక్కరికి రుణాలను మాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సీజన్ నుంచే సన్న ధాన్యానికి రూ.500బోనస్ ఇస్తామన్నారు.