Share News

TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:04 PM

Telangana: పోలీసులను ఉద్దేశిస్తూ ఓ అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ ఖాకీల్లో గుబులు పుట్టిస్తోంది. వరంగల్ సీఐ రవికుమార్ ‌పై ఫోక్సో కేసును ఉటంకిస్తూ ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ రాశాడు. పోలీసులకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను బయటపెడుతూ సదరు వ్యక్తి లేఖ రాయడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది.

TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన  అజ్ఞాత వ్యక్తి లేఖ..
Telangana Police

వరంగల్, అక్టోబర్ 26: వరంగల్‌లో ఓ బాలికపై సీఐ అత్యాచారానికి యత్నించిన ఘటన రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపింది. సీఐ తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్షించాల్సిన పోలీసులే ఇలా కాటేస్తుంటే ఎలా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సీఐ ఘటన పోలీసులకు కలంకాన్ని అంటగట్టగా.. తాజాగా ఖాకీలను ఉద్దేశిస్తూ ఓ అజ్ఞాత వక్తి రాసిన లేఖ పోలీసు వర్గాలతో పాటు పొలిటికల్ వర్గాల్లోనూ తీవ్ర గుబులును రేపుతోంది. వరంగల్‌లో సీఐ రవికుమార్‌పై ఫోక్సో కేసు నేపథ్యాన్ని ఉటంకిస్తూ రాసిన లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది. లేఖలో పోలీసులకు సంబంధించి అనేక ముఖ్య విషయాలు బయటపెట్టాడు సదరు వ్యక్తి.

Delhi: దారుణం.. ఏడు నెలల గర్భవతిని హత్య చేసిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..


2004 బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారులు ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని... ఏకంగా ఓ నిధిని ఏర్పాటు చేసి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా 2004 బ్యాచ్ వాళ్లే లా అండ్ ఆర్డర్ పోస్టింగుల్లో ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అందుకోసం తమ నిధి నుంచి ప్రజాప్రతినిధులకు ఎంతైనా చెల్లిస్తారని ఆరోపణలు గుప్పించారు. 10 నుంచి 50 కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. ఎనిమిదేళ్లుగా జరిగిన పోస్టింగుల వివరాలు సేకరిస్తే అంతా బయటపడుతుందంటూ అజ్ఞాత వ్యక్తి లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారింది.


కూతురి స్నేహితురాలిపై కన్నేసి

కాగా.. వరంగల్‌లో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలు సంచలనంగా మారాయి. మహిళలను, చిన్నారులను రక్షించాల్సిన పోలీసులే వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వరంగల్‌లో మహిళలు, చిన్నారుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు సంచలనం రేపాయి. హన్మకొండ జిల్లా ఖాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే సీఐ రవికుమార్.. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో కూతురి స్నేహితులిపై కన్నేసిన సీఐ.. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సీఐ నుంచి తప్పించుకున్న బాలిక.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ ఘటన ఈనెల 9న జరిగినప్పటికీ బాధితులు ఈనెల 22న ఖాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ రవికుమార్‌పై ఫోక్సో కేసు నమోదు అయ్యింది.

TG Govt: తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలు చర్చకు రానున్నాయా


తల్లితో సన్నిహిత్యం.. ఆపై కూతురిపై కూడా

అలాగే కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో గతంలో ఎస్సైగా పనిచేసి తర్వాత సీఐగా పదోన్నతి పొందిన సంపత్‌ కుమార్‌పై ఇటీవల ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. కేయూలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన తన స్టేషన్‌ పరిధిలో ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు నడిపినట్లు సమాచారం. ఈ విషయంపై సదరు మహిళ భర్త వెళ్లి పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. సంపత్ కుమార్‌ను ఏఆర్‌కు అటాచ్ చేశారు. ఆపై సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు అటు నుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లినా కూడా మహిళతో సన్నిహిత సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో సదరు మహిళ కన్న కూతురిపై కన్నేసిన పోలీసు అధికారి లైంగిక దాడికి యత్నించినట్లు కేయూ పీఎస్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ సంపత్‌ కుమార్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఘటనలు వరంగల్ వ్యాప్తంగా తవ్ర సంచలనం సృష్టించాయి.


ఇవి కూడాచదవండి..

Hyderabad: బెదిరింపులు, సెటిల్‌మెంట్లు.. ఖాకీల లీలలు అన్నిన్ని కావయా !

Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 12:17 PM