Share News

BRS: బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాదర్నా వాయిదా

ABN , Publish Date - Nov 21 , 2024 | 08:07 AM

రాష్ట్రంలో గిరిజనులు, దళితలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం మహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించనున్న మహాదర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకుని దర్నా నిర్వహిస్తామని బీఆర్ఎస్ పేర్కొంది.

BRS: బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాదర్నా వాయిదా

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) గురువారం మహబూబాబాద్‌లో (Mahabubabad) నిర్వహించ తలపెట్టిన మహాదర్నా వాయిదా (Mahadarna Postponement) పడింది. మహబూబాబాద్‌లోని ఎస్పీ కార్యాయం ఎదుట బుధవారం రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. మహాధర్నాకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టి.. నినాదాలు చేసింది. ఆందోళనకారులు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలోకి వాటర్ బాటిల్స్ విసిరారు. ఏఎస్సీతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో మహాధర్నాను బీఆర్ఎస్ వాయిదా వేసింది. హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకుని దర్నా నిర్వహిస్తామని పేర్కొంది. హైకోర్టు అనుమతి వచ్చాక 50 వేల మందితో దర్నా నిర్వహిస్తామని ప్రకటింది. గిరిజనులకు కేటీఆర్ అండగా నిలుస్తుంటే.. ప్రభుత్వం ఓర్వలేకపోతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.


కాగా రాష్ట్రంలో గిరిజనులు, దళితలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం మహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ మహాదర్నా చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే…. గురువారం మహబూబాబాద్‌లో మహాధర్నకు పిలుపిచ్చింది. అయితే ఈ కార్యక్రామానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేసింది.

బీఆర్ఎస్ లగచర్ల ఘటన.. గిరిజన సమస్యలపై పోరాటం చేయనుంది. లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా.. అంటూ కేటీఆర్‌ ఆగ్రహించారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. వాస్తవాలను తొక్కిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

తెలంగాణకు రేవంత్‌రెడ్డి కాలకేయుడిలా మారారని, బాహుబలి లాంటి కేసీఆర్‌ చేతిలో రేవంత్‌ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జోగురామన్న తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రాణాలకు తెగించి పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ మొక్కకాదు.. మహావృక్షమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం టీఆర్‌ఎస్‌తోనే మొదలైందని, అప్పుడు కేసీఆర్‌ను పొగుడుతూ ప్రకటనలు చేసిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు నోటికొచ్చినట్లు తిట్టడం సరికాదన్నారు. కాగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామంటే సీఎం రేవంత్‌రెడ్డికి ధైర్యం సరిపోవడం లేదా? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో మహాధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని కేటీఆర్‌ నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐటీకి మరింత ఊతం: సీఎం చంద్రబాబు

జనంలోకి మనం..

మరో పదేళ్లు చంద్రబాబే సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 21 , 2024 | 08:15 AM