Share News

MLA Nagaraju: బీఆర్ఎస్ నేతలను IPC 390 సెక్షన్‌తో పోల్చిన ఎమ్మెల్యే నాగరాజు

ABN , Publish Date - Jan 08 , 2024 | 03:28 PM

బీఆర్ఎస్ ( BRS ) నేతలను IPC 390 సెక్షన్‌తో కాంగ్రెస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ( MLA Nagaraju ) పోల్చారు. కాంగ్రెస్ హామీలను 420తో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎమ్మెల్యే నాగరాజు ఈ కామెంట్స్ చేశారు. సోమవారం నాడు పాలకుర్తి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

MLA Nagaraju: బీఆర్ఎస్ నేతలను IPC 390 సెక్షన్‌తో పోల్చిన ఎమ్మెల్యే నాగరాజు

మహబూబాబాద్: బీఆర్ఎస్ ( BRS ) నేతలను IPC 390 సెక్షన్‌తో కాంగ్రెస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే KR. నాగరాజు ( MLA Nagaraju ) పోల్చారు. కాంగ్రెస్ హామీలను 420తో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎమ్మెల్యే నాగరాజు ఈ కామెంట్స్ చేశారు. సోమవారం నాడు పాలకుర్తి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మీడియాతో మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారి దోపిడీ దొంగల ప్రభుత్వమని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలు దోపిడీ దొంగలను తరిమికొట్టారని ఎద్దేవా చేశారు. IPC 390 సెక్షన్ ఏంటో గూగుల్‌లో చూడాలని ఎమ్మెల్యే నాగరాజు సెటైర్లు వేశారు. కాగా IPC 390 సెక్షన్ రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2024 | 03:45 PM