Share News

Warangal: 16న పెళ్లి... అంతలోనే విషాదం

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:09 AM

Telangana: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈనెల 16న పెళ్లికావల్సిన భూక్య కృష్ణతేజ అనే యువకుడు కాకతీయ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న (సోమవారం) సాయంత్రం బైక్‌పై పలివేల్పుల దగ్గర ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ దగ్గర బైక్ నిలిపిన కృష్ణతేజ... ఆపై కెనాల్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Warangal: 16న పెళ్లి... అంతలోనే విషాదం

వరంగల్, మార్చి 12: మరో నాలుగు రోజుల్లో యువకుడి పెళ్లి. ఇళ్లంతా పెళ్లి కళ సంతరించుకుంది. కుటుంబసభ్యులు వివాహానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అంతలోనే అంతులేని విషాదం వారి ఇంటి ముందు నిలిచింది. పెళ్లితో పండుగ వాతావరణంలా ఉండాల్సిన ఇళ్లు యువకుడి నిర్ణయంతో విషాదంగా మారింది.

IPL2024: జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా.. వీడియో షేర్ చేసిన ముంబై ఇండియన్స్


అసలేం జరిగిందంటే... వరంగల్ (Warangal) కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈనెల 16న పెళ్లికావల్సిన భూక్య కృష్ణతేజ అనే యువకుడు కాకతీయ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న (సోమవారం) సాయంత్రం బైక్‌పై పలివేల్పుల దగ్గర ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ దగ్గర బైక్ నిలిపిన కృష్ణతేజ... ఆపై కెనాల్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన యువకుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తల్లి శంకుతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వర్థన్నపేట సమీపంలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. అయితే యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి...

Hyderabad: హుస్సేన్‌సాగర్‌ అలలపై.. అద్భుత లేజర్‌ షో.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏర్పాటు..

Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీట్ల పంపకం..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 11:15 AM