Share News

Anantapur : ‘అనంత’లో జననీ మిత్ర యాప్‌ ప్రారంభం

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:18 AM

ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జననీ మిత్ర యాప్‌ను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌

 Anantapur : ‘అనంత’లో జననీ మిత్ర యాప్‌ ప్రారంభం

  • మాతాశిశు మరణాల నివారణకు ఏఐ సాంకేతికత

  • కూడేరు పీహెచ్‌సీలో పైలెట్‌ ప్రాజెక్టు అమలు

కూడేరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, మాతాశిశు మరణాలను నివారించేందుకు ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జననీ మిత్ర యాప్‌ను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ శుక్రవారం ప్రారంభించారు. మోడల్‌ పీహెచ్‌సీగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిన అనంతపురం జిల్లా కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి యాప్‌ను ప్రారంభించారు. జిల్లాలోని కూడేరు, పామిడి మండలాల్లో రక్తహీనత కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అందుకే కూడేరును పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. అందుబాటులోని సాంకేతిక వనరులను ఉపయోగించి.. రక్తహీనత, మతాశిశు మరణాలను నివారించడమే పైలెట్‌ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated Date - Feb 15 , 2025 | 05:18 AM