MLA : ప్రజా సహకారంతో సుపరిపాలన
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:06 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్లలోనే ప్రజల సహకారంతో సంక్షేమం, అభివృ ద్ధి అమలు చేస్తూ, సుపరిపాలనను అందిస్తున్నామని ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీనగర్ వద్ద బుడగ జంగాల కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, గోకులం షెడ్డును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.

ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ
బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్లలోనే ప్రజల సహకారంతో సంక్షేమం, అభివృ ద్ధి అమలు చేస్తూ, సుపరిపాలనను అందిస్తున్నామని ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీనగర్ వద్ద బుడగ జంగాల కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, గోకులం షెడ్డును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ... అన్ని వర్గాల ఆశలు నేరవేర్చేలా కూటమి ప్రభు త్వం ఆహర్నిశలు పనిచేస్తోందన్నారు. రానున్న కాలంలో కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. డీఈ అరుణ్‌కుమార్, ఎంపీడీఓ సాల్మన రాజ్, తహసీల్దార్ పుణ్యవతి, కన్వీనర్ అశోక్, ఎంపీపీ సునీత, టీడీపీ జిల్లా నేత పసుపుల శ్రీరామిరెడ్డి, నాయకులు రవీంద్ర, ఎస్ నారా యణస్వామి, కేశన్న, లక్ష్మీనారాయణ, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....