Share News

TNATU : అంగనవాడీల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:42 AM

అంగనవాడీల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుగునాడు అంగనవాడీ ట్రేడ్‌ యూనియన (టీఎనఏటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం అనంతలక్ష్మి, కె.లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యా లయంలో బుధవారం యూనియన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వ హించారు.

TNATU : అంగనవాడీల సమస్యల పరిష్కారమే లక్ష్యం
TNATU state leaders presenting petition to CDPO

టీఎనఏటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

చెన్నేకొత్తపల్లి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అంగనవాడీల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుగునాడు అంగనవాడీ ట్రేడ్‌ యూనియన (టీఎనఏటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం అనంతలక్ష్మి, కె.లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యా లయంలో బుధవారం యూనియన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంగనవాడీల సమస్య లను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వానికి అంగన వాడీలకు మధ్య వారధిగా పని చేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి టీఎనఏటీయూ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు యూనియనలో విరివిగా సభ్యత్వాలు తీసుకోవాలన్నారు. అనంత రం అంగనవాడీల సమస్యలపై సీడీపీఓ కవితాదేవికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షురాలు దళవాయి రమాదేవి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ వీణ, జిల్లా అడహక్‌ కమిటి సభ్యులు జమున, సుజాత తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 09 , 2025 | 12:42 AM