SHADE : ప్రయాణికులకు నీడ ఏదీ?
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:07 AM
వేసవికాలం వచ్చిం దంటే చాలు... నగరంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, పాదాచారు లు ఉక్కిరిబిక్కిరవుతుంటారు. ఇక సర్కిళ్లు, బస్టా్‌పల వద్ద నిలబడిన సమ యంలో వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రయాణికులను ఎండబారి నుంచి తప్పించేందుకు ప్రతి ఏడాది నగరంలోని పలు సర్కిళ్లు, బస్టా్‌పలలో పరదాలు కట్టేవారు. ఆ నీడలో కాస్త ఉపశమనం పొందే వీలుంటుంది.

- నగరంలోనిని సర్కిళ్లల్లో కనిపించని బస్ షెల్టర్లు, పరదాలు
- మండుటెండల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న
వాహనదారులు, ప్రయాణికులు
అనంతపురం ప్రెస్‌క్లబ్, మార్చి 20(ఆంధ్రజ్యోతి) : వేసవికాలం వచ్చిం దంటే చాలు... నగరంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, పాదాచారు లు ఉక్కిరిబిక్కిరవుతుంటారు. ఇక సర్కిళ్లు, బస్టా్‌పల వద్ద నిలబడిన సమ యంలో వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రయాణికులను ఎండబారి నుంచి తప్పించేందుకు ప్రతి ఏడాది నగరంలోని పలు సర్కిళ్లు, బస్టా్‌పలలో పరదాలు కట్టేవారు. ఆ నీడలో కాస్త ఉపశమనం పొందే వీలుంటుంది. ఈ ఏడాది మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. కనీసం సర్కిళ్లల్లో కనీ సం రెండు నిమిషాలు నిలబడలేని పరిస్థితి. అయితే సంబంధిత అధి కారులు మాత్రం ఈ ఏడాది సర్కిళ్లల్లో పరదాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ సమయంలో ప్రధాన సర్కిళ్లల్లో నిలబడే వాహన దారులు ఎండకు మండిపోతున్నారు. నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్, బళ్లారి బైపాస్, శ్రీకంఠం సర్కిల్, సూర్యానగర్ రోడ్డు, నడిమివంక సర్కిల్, బస్టా్‌పల వద్ద ప్రయాణికులు, వాహనదారులు ఎండవేడిమిని భరించకలేక ఇబ్బందులుపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పరదాలు, బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....