Union Minister Srinivasavarma : రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
ABN , Publish Date - Jan 22 , 2025 | 05:14 AM
సీటీఆర్‌ఐ గత 75 ఏళ్లుగా పొగాకు రైతుల ఆర్థిక జీవన స్థితి గతులను మెరుగు పరచడానికి విశేషంగా కృషి చేసిందని కేంద్ర భారీ పరిశ్రమలు....

ఎన్‌ఐఆర్‌సీఏ ఆవిష్కరణలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ
రాజమహేంద్రవరం రూరల్, జనవరి 21( ఆంధ్రజ్యోతి): సీటీఆర్‌ఐ గత 75 ఏళ్లుగా పొగాకు రైతుల ఆర్థిక జీవన స్థితి గతులను మెరుగు పరచడానికి విశేషంగా కృషి చేసిందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఇప్పుడు ఈ సంస్థ పరిధిని పెంచుతూ పొగాకుతో పాటు అదనంగా పసుపు, మిరప, ఆముదం, అశ్వగంధ పంటలను చేర్చి ఐసీఏఆర్‌గా రూపొందించామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సీటీఆర్‌ఐలో మంగళవారం జరిగిన ఎన్‌ఐఆర్‌సీఏ ఆవిష్కరణ వేడుకలు జరిగాయి. దీనికి శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్‌ఐఆర్‌సీఏ లోగోను, ఎన్‌ఐఆర్ సీఏ భవన సముదాయం పేరును ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఐఆర్‌సీఏ ద్వారా భారత రైతాంగం భవిష్యత్తులో ఎంతో లబ్ధి పొందగలదని తెలిపారు. ప్రధాని మోదీ 10 ఏళ్లుగా రైతుల ఆదాయం రెట్టింపు దిశగా విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంచి వ్యవసాయాన్ని వాణిజ్యంగా తీర్చిదిద్ది, దిగుమతులను తగ్గించుకోవాలని కృషి చేస్తున్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News