Amaravati : పనికిరాకుండా వేబ్రిడ్జిల నిర్మాణం
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:49 AM
ధాన్యం, ఇతర పంటల తూకం కోసం 2022-23లో వివిధ జిల్లాల్లోని ఆర్‌బీకేల వద్ద 93 వేబ్రిడ్జిలు నిర్మించారు.

గత ప్రభుత్వంలో కమీషన్ల కక్కుర్తి
పెందుర్తి, పద్మనాభం మండలాల్లో అవకతవకలు
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రైతు భరోసా కేంద్రాల వద్ద నిర్మించిన వేబ్రిడ్జిలు నిరుపయోగంగా మారాయి. ధాన్యం, ఇతర పంటల తూకం కోసం 2022-23లో వివిధ జిల్లాల్లోని ఆర్‌బీకేల వద్ద 93 వేబ్రిడ్జిలు నిర్మించారు. 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వేబ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిధులు వెచ్చించింది. ఒక్కొక్క దానికి రూ.25 లక్షలు ఖర్చు చేశారు. కాగా, తూకానికి అనువు కానిచోట వేబ్రిడ్జిలకు స్థలాలను ఎంపిక చేశారని, పనుల్లో నిబంధనలు పాటించలేదని మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. పలువురు ఇంజనీరింగ్ అధికారులకు పెద్దఎత్తున కమీషన్లు ముట్టినట్లు ఆరోపణలువచ్చాయి. విశాఖ జిల్లా పెందుర్తి, పద్మనాభం మండలాల్లో నిర్మించిన వేబ్రిడ్జిలపైకి లోడు లారీలు ఎక్కడానికి వీలుకానివిధంగా నిర్మించారని, నిధులు వృథా అయ్యాయని మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. దీనిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారికి మెమో జారీ చేశారు.