AP News: తిరుపతిలో రెచ్చిపోయిన కాంట్రాక్టర్ .. డబ్బులు ఇవ్వలేదని ఆటో డ్రైవర్‌పై..
ABN , Publish Date - Mar 27 , 2025 | 06:21 PM
Parking issues: తిరుపతిలో ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు. అతని అనుచరులతో ఆటో డ్రైవర్‌పై దాడికి దిగారు. విచక్షణ రహితంగా ఆటో డ్రైవర్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాహనదారులు చెబుతున్నారు.

తిరుపతి: తిరుపతి జిల్లాలోని రేణిగుంట రైల్వేస్టేషన్ వద్ద ఆటో డ్రైవర్‌పై ఇవాళ(గురువారం) దాడి జరిగింది. శ్రీవారి భక్తురాలు ఆటోలోనే ఉండగా డ్రైవర్‌పై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ కాంట్రాక్టర్‌కు సంబంధించిన అనుచరులు ఈ దాష్టికానికి పాల్పడినట్లు సమాచారం. రూ. 30ల పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే అంటూ ఆటోని అడ్డుకొని కాంట్రాక్టర్ అనుచరులు బీభత్సం సృష్టించారు. ఈ దాడి జరగడంతో ఆటోలో ఉన్న మహిళా ప్రయాణికురాలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
స్థానికులు జోక్యం చేసుకొని ఆమెను వేరే ఆటోలో అక్కడి నుంచి పంపించి వేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్ పార్కింగ్ ఆవరణలో కాంట్రాక్టర్ అనుచరులు బీభత్సం చేసి యుద్ధ వాతావరణం సృష్టించారు. తిరుమలకు ప్రయాణించే యాత్రికులు భయభ్రాంతులకు గురయ్యారు.. గత రెండేళ్లుగా ప్రయాణికులను రేణిగుంట రైల్వే స్టేషను వద్ద దించి వెళ్లే వాహనాల నుంచి కాంట్రాక్టర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంతకల్ డీఆర్ఎంకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వాహనదారులు చెబుతున్నారు.
అక్రమ వసూళ్లలో అధికారులు మునిగిపోయారని.. నెల మాముళ్లు తీసుకుంటున్నారే తప్పా చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆరోపించారు. రేణిగుంట రైల్వేస్టేషన్ వద్ద వాహనం పార్కింగ్ చేస్తేనే నగదు వసూలు చేయాలనే నిబంధన ఉందని వాహనదారులు చెబుతున్నారు. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికులను వదిలినా, పికప్ చేసుకున్న పార్కింగ్ పేరుతో రెండేళ్లుగా అక్రమంగా వసూళ్లకు కాంట్రాక్టర్ పాల్పడుతున్నాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Jayamangala చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..
Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పలు చోట్ల ఉద్రిక్తత
For More AP News and Telugu News