Share News

చెస్‌తో మేధాశక్తి పెంపుదల

ABN , Publish Date - Jan 19 , 2025 | 12:18 AM

పెద్దాపురం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల మేధాశక్తి పెంపొందించేందుకు చెస్‌ దోహద పడుతుందని ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ అర్బిటర్స్‌ కమీషన్‌ చైర్మన్‌ ఆర్‌.రాజేష్‌ అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి స్కూల్‌ చెస్‌ చాంపి యన్‌ షిప్‌ పోటీల్లో భాగంగా రెండవ రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిఽథిగా మాట్లా డారు. చెస్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్స

చెస్‌తో మేధాశక్తి పెంపుదల
చెస్‌ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ అర్బిటర్స్‌ కమీషన్‌ చైర్మన్‌ రాజేష్‌

‘శ్రీప్రకాష్‌’లో రెండో రోజు జాతీయస్థాయి చెస్‌ పోటీలు

పెద్దాపురం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల మేధాశక్తి పెంపొందించేందుకు చెస్‌ దోహద పడుతుందని ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ అర్బిటర్స్‌ కమీషన్‌ చైర్మన్‌ ఆర్‌.రాజేష్‌ అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి స్కూల్‌ చెస్‌ చాంపి యన్‌ షిప్‌ పోటీల్లో భాగంగా రెండవ రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిఽథిగా మాట్లా డారు. చెస్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీప్రకాష్‌ పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. విద్యా ర్థులు తమలోని దాగి ఉన్న మేధా శక్తిని వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగ పడ తాయన్నారు.పోటీలను తిలకించి క్రీడాకారులకు మెళకువలను నేర్పించారు. కార్య క్రమంలో ఏపీ చెస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కేవీవీశర్మ, కార్యదర్శి ఏసీఏ అడుసుమిల్లి, అనంతరామ్‌, పాఠశాల డైరెక్టర్‌ సీహెచ్‌. విజయ్‌ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 12:18 AM