Share News

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

ABN , Publish Date - Mar 03 , 2025 | 02:56 PM

వైసీపీ హయాంలో ఏపీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రహదారులను కూటమి ప్రభుత్వం బాగు చేసినట్లు ఆయన చెప్పారు.

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..
MLA Gorantla Butchaiah Chowdary

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) చేసిన అప్పులను సైతం చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వమే తీరుస్తోందని చెప్పారు. ఈ మేరకు జగన్ సర్కార్ చేసిన రూ.43 వేల కోట్ల అప్పులను తమ ప్రభుత్వమే చెల్లించినట్లు వెల్లడించారు.


వైసీపీ హయాంలో ఏపీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రహదారులను బాగు చేసినట్లు ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ బడ్జెట్(2025-26) తొలిసారిగా రూ.3 లక్షల మార్కు దాటిందని, ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతి రంగానికీ తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు సహా ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమానికీ గత ప్రభుత్వం కంటే అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉందని, ఈ మేరకే రూ.6 లక్షల కోట్ల పెట్టుబడితో ఎంవోయులు కుదుర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. పోసాని ఓ మూర్ఖశిఖామణి అంటూ కామెంట్ చేశారు. ఎదుటివారి కుటుంబసభ్యులు, ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోసాని లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని, కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాదులో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు..

జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 03 , 2025 | 02:56 PM