విద్యతోపాటు క్రీడలు అవసరమే
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:15 AM
పెద్దాపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): విద్యతోపాటు బాలలకు క్రీడలు కూడా ఎంతో అవసరమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురలో శ్రీప్రకాష్ సినర్జీస్ పాఠశాలలో ఐదురోజులపాటు జరగను న్న జాతీయస్థాయి స్కూల్ చెస్ చాంపియన్ షిప్ పోటీలను జ్యోతీ ప్రజ్వలన చే

ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం ‘శ్రీప్రకాష్’లో ప్రారంభమైన జాతీయస్థాయి చెస్ పోటీలు
పెద్దాపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): విద్యతోపాటు బాలలకు క్రీడలు కూడా ఎంతో అవసరమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురలో శ్రీప్రకాష్ సినర్జీస్ పాఠశాలలో ఐదురోజులపాటు జరగను న్న జాతీయస్థాయి స్కూల్ చెస్ చాంపియన్ షిప్ పోటీలను జ్యోతీ ప్రజ్వలన చేసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పట్ల మక్కువను పెంచుకోవాలన్నారు. క్రీడలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. ముఖ్యంగా చెస్ ద్వారా మేధాశక్తి పెంపొందు తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీశర్మ మాట్లాడుతూ జాతీయస్థాయిలో చెస్ పోటీలను నిర్వహించడం గొప్ప విషయమ న్నారు. సాటిమేటి క్రీడాకారులుగా తీర్చి దిద్దబడాలంటే నిరంతర సాధన అవస రమన్నారు. నిత్య సాధనతోనే మంచి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజాసూరిబాబురాజు మాట్లాడుతూ పెద్దాపురంలో ఇటువంటి క్రీడాపోటీలు జరగడం గర్వకారణమని అందుకు శ్రీప్రకాష్ పాఠశాల వేదిక కావడం సంతోషదాయకమన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్‌ప్రకాష్ మాట్లా డుతూ 5 రోజులపాటు చెస్ పోటీలు జరుగుతాయని, సుమారు 1200మంది క్రీడాకారుల హాజరుకానున్నట్లు చెప్పా రు. జాతీయస్థాయి పోటీలను తమ పాఠశాలలో ఏర్పాటు చేయడంపై సం తోషం వ్యక్తం చేశారు. చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.