Minister Nimmala Ramanaidu : డీఈఈల పదోన్నతులకు లైన్ క్లియర్!
ABN , Publish Date - Jan 29 , 2025 | 06:26 AM
ఇంజనీరింగ్ అధికారుల మధ్య వివాదాలు తలెత్తి న్యాయపోరాటాలు చేస్తున్న తరుణంలో, వారి మధ్య సఖ్యతను పెంచేలా మంత్రి నిమ్మల రామానాయుడు చొరవ చూపడంతో సమస్యకు పరిష్కారం.

మంత్రి నిమ్మల చొరవతో 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే!
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖలో ఇంజనీరింగ్ అధికారుల పదోన్నతులకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయా యి. సీనియారిటీ విషయంలో ఇంజనీరింగ్ అధికారుల మధ్య వివాదాలు తలెత్తి న్యాయపోరాటాలు చేస్తున్న తరుణంలో, వారి మధ్య సఖ్యతను పెంచేలా మంత్రి నిమ్మల రామానాయుడు చొరవ చూపడంతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా మరోసారి మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. ఇప్పటి వరకూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సూపరింటెండింగ్ ఇంజనీరు, చీఫ్ ఇంజనీరు హోదా ఇంజనీరింగ్ అధికారులకు పదోన్నతులు కల్పించినా, డీఈఈల పదోన్నతుల విషయంలో సంక్లిష్టతను ఎదుర్కొనాల్సి వచ్చింది.
For AndhraPradesh News And Telugu News