Raghu Rama: రఘురామ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
ABN , Publish Date - Feb 07 , 2025 | 07:41 AM
Raghu Rama: రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరికొంతమందిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, రఘురామ కృష్ణంరాజు వైద్య నివేదికను అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

ప్రకాశం : డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇవాళ(శుక్రవారం) ప్రభావతిని ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ చేసినా మెడికల్ రిపోర్ట్ మార్చారనే ఆరోపణలు గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నాయి.
ప్రభావతికి నోటీసులు
విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో అజ్ఞాతంలోకి ప్రభావతి వెళ్లారు. ప్రభావతిపై ఎస్పీ దామోదర్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టులో ఆరు వారాల పాటు ప్రభావతి ఊరట పొందారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎస్పీ కార్యాలయంలో విచారణకు ప్రభావతి రానున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్, కామేపల్లి తులసీబాబు. అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ
విలువల గురించి జగన్ మాట్లాడటం... పాతివ్రత్యం గురించి చింతామణి చెప్పినట్టుంది
మరిన్ని ఏపీ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి