Share News

Palnadu: తురకా కిషోర్‌ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు

ABN , Publish Date - Jan 06 , 2025 | 05:18 PM

Palnadu: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాచర్లలో అరాచకం సృష్టించిన మాజీ మునిసిఫల్ చైర్మన్ తురకా కిషోర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడితోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌కు సైతం కోర్టు రిమాండ్ విధించింది.

Palnadu: తురకా కిషోర్‌ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు
YCP Leader Turaka Kishore

అమరావతి, జనవరి 06: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్‌‌తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌కి మాచర్ల కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ వారిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2022లో మాచర్లలోని టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టిన కేసులో తురకా కిషోర్‌తోపాటు అతడి సోదరుడిపై పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తురకా కిషోర్.. మాచర్ల మునిసిపల్ చైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆ పార్టీనే అధికారంలో ఉండడంతో పోలీసులు సైతం అడుగు ముందుకు వేయ్య లేదు. దీంతో వారిపై చర్యలు తీసుకోలేదు. అదికాక.. పిన్నెల్లి సోదరుల అండ దండా చూసుకొని తురకా కిషోర్‌, తురకా శ్రీకాంత్ రెచ్చిపోయారు.

ఆ క్రమంలో 2022, డిసెంబర్ 16వ తేదీ మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి.. ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్‌కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ పథకం ప్రకారం.. ఈ కార్యక్రమంపై తురక కిషోర్.. తన పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలతో కలిసి దాడి చేశారు. అలాగే వారిపై హత్యాయత్నం సైతం చేశారు. ఇక టీడీపీకి చెందిన పలువురి నేతలు ఇళ్లలో లూఠీకి సైతం పాల్పడ్డారు. అదే విధంగా కార్లు, బైకులను కూడా ధ్వంసం చేశారు.


అదే రోజు రాత్రి.. మాచర్లలోని టీడీపీ కార్యాలయాన్ని సైతం తగలబెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా.. కారంపూడి సీఐపై దాడి చేశాడు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో బూత్‌ల వద్ద టీడీపీ ఏజెంట్లపై దాడి చేయడంతోపాటు మాచర్లలో వీరంగం కూడా సృష్టించాడు.

Also Read: రెచ్చిపోయిన మావోయిస్టులు.. భారీ సంఖ్యలో జవాన్లు మృతి


ఇక మాచర్ల పర్యటనకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమాలు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి.. వారిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. ఈ ఘటనలో కారులోని న్యాయవాది గాయపడ్డారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తురకా బ్రదర్స్‌పై దాదాపు10 కేసులు పైగా నమోదయ్యాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో తురక కిషోర్.. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లారు.

Also Read: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 32 మందికి గాయాలు


దాదాపు ఏడు నెలల పాటు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో తురకా కిషోర్ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని ఆదివారం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాచర్ల తరించారు. సోమవారం తురకా కిషోర్‌తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌ను కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 06 , 2025 | 05:19 PM