Share News

YS Sharmila: ఆరోగ్య శ్రీ పెండింగ్ బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Jan 07 , 2025 | 10:25 AM

YS Sharmila:ఆరోగ్య శ్రీ బిల్లులను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.

YS Sharmila: ఆరోగ్య శ్రీ పెండింగ్ బకాయిలు చెల్లించాలి
YS Sharmila

విజయవాడ: పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ...దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక ఈ పథకం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రాణాలు తీసే జబ్బు వచ్చినా ఆదుకునే సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా షర్మిల ట్విట్ చేశారు. రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటమంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని వైఎస్ షర్మిల విమర్శించారు.


ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని చెప్పారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ.. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆరోగ్య శ్రీని ఏపీలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలను జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని..వాటిని చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. వెంటనే ఆస్పత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Special Trains: పండుగ రోజుల్లో ఈ ట్రైన్స్‌లో ఖాళీలే ఖాళీలు.. త్వరపడండి..

Railway Zone : ‘రైల్వే జోన్‌ డీపీఆర్‌’

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 07 , 2025 | 10:30 AM