ABN Live: ఏపీ బడ్జెట్..
ABN , Publish Date - Feb 28 , 2025 | 10:25 AM
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముందుగా విజయవాడలో తన ఇంటి వద్ద పయ్యావుల అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన 2.94 లక్షల కోట్ల రూపాయల ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే ఇది పది శాతం ఎక్కువ. అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్‌లో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలతోపాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయని, కేంద్రం సహకారంతో వీటిని అమలు చేసేలా పద్దులు రూపొందించినట్లు సమాచారం. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత... తొలి పూర్తిస్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఏబీఎన్ లైవ్ చూడండి..
ఈ వార్త కూడా చదవండి..
ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్సార్‌సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..
ఇదేంది జగన్.. నాడు అలా.. నేడు ఇలా..
పోసాని రిమాండ్‌పై న్యాయవాది పొన్నవోలు ఎమన్నారంటే..
పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News