YS Sharmila: హామీలు ఇచ్చినప్పుడు తెలీదా.. బాబుకు షర్మిల సూటి ప్రశ్న
ABN , Publish Date - Jan 17 , 2025 | 09:44 AM
YS Sharmila: ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారంటూ వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారన్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబు వ్యవహారమన్నారు.

విజయవాడ , జనవరి 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (AP CM Chandrababu Naidu) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) మరోసారి విరుచుకుపడ్డారు. సూపర్ సిక్స్ ఏమైందంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాలపై హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం తెలియదా అంటూ మండిపడ్డారు. హామీలన్నీ తొంగలో తొక్కారని విమర్శించారు. " ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు.. అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారంటూ కామెంట్స్ చేశారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారన్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబు వ్యవహారమన్నారు. ‘‘చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు ? రాష్ట్రాన్ని సహాయ పడనప్పుడు మోడీతో చెట్టాపట్టాలు దేనికోసం ? ’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిపంచారు.
ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కారన్నారు. విజన్ల పేరుతో వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్పా.. బాబు పనితనం శూన్యమన్నారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా అని.. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..
AP NEWS: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Read Latest AP News And Telugu News