Lokesh Birthday: లోకేష్‌కు శుభాకాంక్షల వెల్లువ
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:44 PM
Nara Lokesh: రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ జిల్లా, జనవరి 23: ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ (Lokesh Birthday) చెబుతున్నారు. అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. అలాగే రక్తదాన శిబిరం నిర్వహించారు.
లోకేష్‌కు చిరు శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ప్రియమైన నారా లోకేష్ . ఏపీ మరింత అభివృద్ధి సాధించడం కోసం , తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ అభిరుచి, నిర్విరామ కృషి హర్షణీయం. మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలి’’ అంటూ చిరంజీవి ఎక్స్‌లో పోస్టు చేశారు.
టీడీపీ భవిష్యత్ నాయకుడు లోకేష్: ఎమ్మెల్యే వసంత
మైలవరంలో ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయం కూడలిలో ఎమ్మెలయే కేక్ కట్ చేశారు. అనంతరం వరదలకు నష్టపోయిన మైలవరం లక్కి రెడ్డి హనిమిరెడ్డి కాంప్లెక్స్‌లోని దుకాణదారులకు నష్ట పరిహారం చెక్కులు ఎమ్మెల్యే వసంత అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం భవిష్యత్ నాయకుడు లోకేష్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో లోకేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కష్టాల్లో ఉన్న పార్టీని, నాయకులు, కార్యకర్తలకు యువగళం పాదయాత్రతో వెన్నంటే ఉన్న నాయకులు లోకేష్ అని కొనియాడారు. రాష్ట్రం కోసం దేశ విదేశాల్లో లోకేష్ ఎంతో కష్ట పడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో లోకేష్ కష్టానికి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
Lokesh Davos Tour: దావోస్ పర్యటనలో లోకేష్ బిజీబిజీ..
రక్తదాన శిబిరం ఏర్పాటు..
విజయనగరం: టీడీపీ యువనేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనుహ్యస్పందన లభించింది. వందలాది మంది యువత ముందుకు వచ్చి రక్తదానాలు చేస్తున్నారు. లోకేష్‌కు శుభాశీస్సులు అందించాలని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. రక్తదాన శిబిరాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిగజపతి ప్రారంభించారు.
కృష్ణా జిల్లా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాము కేక్ కట్ చేశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున లోకేష్‌కు ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నాలో స్ఫూర్తి నింపిన నాయకుల్లో లోకేష్ ఒకరు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడమే ఆశయంగా లోకేష్ కష్టపడుతున్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి.. సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు లోకేష్’’ అంటూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు.
విశాఖపట్నం: నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి.. లోకేష్‌కు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ఎంపీ భరత్, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జి, రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్ హాజరయ్యారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ బర్తడే సెలబ్రేషన్స్ నిర్వహించన టీడీపీ కార్యకర్తలు, నేతలు.. కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అల్లూరి జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి మాజీ టీడీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
రాజమండ్రి: అనపర్తిలో లోకేష్ పుట్టిన రోజు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఏలూరు జిల్లా: మంత్రి లోకేష్‌కు జంగారెడ్డిగూడెం హైస్కూల్ విద్యార్థులు వినూత్న పద్ధతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్తడే లోకేష్ సార్ అనే ఆకారంలో విద్యార్థులు కూర్చున్నారు. విద్యా వ్యవస్థలో లోకేష్ తెచ్చిన మార్పులు విద్యార్థుల భవితవ్యానికి దిక్సూచిలా మారాయి.
పశ్చిమగోదావరి: తణుకు నియోజకవర్గంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో పేదవారికి ఎమ్మెల్యే అరిమిల్లి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
కాగా.. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రాని పెట్టుబడుల తేవడమే లక్ష్యంగా లోకేష్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. వివిధ కంపెనీల అధినేతలతో లోకేష్ భేటీ అవుతూ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News