బకాయిలు చెల్లించాలి: ఫ్యాప్టో
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:36 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యా, ఉద్యోగుల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర పరిశీలకుడు జి.హృదయరాజు, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కేవీ శివయ్య డిమాండ్ చేశారు.

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యా, ఉద్యోగుల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర పరిశీలకుడు జి.హృదయరాజు, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కేవీ శివయ్య డిమాండ్ చేశారు. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమం చేపట్టారు. హృదయరాజు, శివయ్య మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాలరాసే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను, ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, కమిషన్‌ను నియమించడం ఆలస్యమైతే వెంటనే 30శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంతోపాటు సమాంతరంగా తెలుగు, ఉర్దూ మాధ్యమాలను కొనసాగించాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన 72, 73, 74జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో రామునాయక్‌కు ఫ్యాప్టో నాయకులు వినతిపత్రం అందించారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ అబ్దుల్‌కలాం, కార్యవర్గ సభ్యులు వరప్రసాద్, మౌలాలి, శ్రీనివాసులు, కుమారి, కిశోర్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.